stock market: ఆర్బీఐ ఎఫెక్ట్.. దూసుకుపోయిన సెన్సెక్స్
- వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
- ద్రవ్యోల్బణం అంచనాలు కూడా తగ్గింపు
- ఉత్సాహంగా ట్రేడింగ్ చేసిన ఇన్వెస్టర్లు
ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు... ఆర్బీఐ ప్రకటనతో మరింత ఉత్సాహంగా పరుగులు పెట్టాయి. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతోపాటు, ద్రవ్యోల్బణంపై అంచనాలను తగ్గించడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో, వారు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 578 పాయింట్లు పెరిగి 33,597కు చేరుకుంది. నిఫ్టీ 197 పాయింట్లు లాభపడి 10,325 వద్ద క్లోజ్ అయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వీఐపీ ఇండస్ట్రీస్ (17.15%), ఫ్యూచర్ లైఫ్ స్టైల్ (9.51%), కెనరా బ్యాంక్ (8.26%), కేర్ రేటింగ్స్ (7.82%), జిందాల్ స్టీల్ అండ్ పవర్ (7.47%).
టాప్ లూజర్స్:
స్ట్రైడ్స్ షాసన్ లిమిటెడ్ (-5.59%), వక్రాంగీ (-4.98%), క్వాలిటీ (-3.30%), బలరామ్ పూర్ చినీ మిల్స్ (-3.24%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (-2.92%).