iyr krishna rao: ఆ భూములను చూస్తే కళ్లల్లో నీళ్తొస్తున్నాయి : వడ్డే శోభనాద్రీశ్వరరావు
- సారవంతమైన భూములను కాంక్రీట్ జంగల్ గా మార్చుతారా?
- అమరావతి ద్వారా లబ్ధి పొందేది సింగపూర్ దేశమే
- రాజధాని నిర్మాణమంతా లాలూచీ వ్యవహారమే
అత్యంత సారవంతమైన భూములను కాంక్రీట్ జంగిల్ గా మార్చాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని, ఆ భూములను చూస్తే కళ్లల్లో నీళ్తొస్తున్నాయని సీనియర్ రాజకీయవేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణ సభకు ప్రత్యేక అతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, అమరావతి ద్వారా లబ్ధి పొందేది సింగపూర్ దేశమేనని, సింగపూర్ కంపెనీలకు, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కట్టబెడతారా? ప్లాట్లు వేసి అమ్మేందుకు సింగపూర్ కంపెనీలకు భూములివ్వాలా? అని ప్రశ్నించారు. రైతులు భూములు ఇవ్వడమే కాదు, అప్పులు కూడా ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారని విమర్శించారు. అసలు రైతులను అప్పులు అడగడం ఎంత అన్యాయమని ప్రశ్నించిన ఆయన, రాజధాని నిర్మాణమంతా లాలూచీ వ్యవహారమేనని ఆరోపించారు.