chennai super kings: సమరానికి సిద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్!

  • సమర్థవంతమైన కెప్టెన్సీకి ధోనీ పెట్టింది పేరు
  • స్కోరు బోర్డును అమాంతం ఉరకలెత్తించగల రైనా బలం
  • హర్భజన్, జడేజా స్పిన్ మాయ

మ్యాచ్ ఫిక్సింగ్ తో రెండేళ్లు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో పునరాగమనం చేస్తోంది. మహేంద్ర సింగ్‌ ధోని నేతృత్వంలో మళ్లీ పూర్వ వైభవం సొంతం చేసుకునేందుకు చెన్నై జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐపీఎల్‌ లో అత్యంత విజయవంతమైన జట్టు గా చెన్నై సూపర్‌ కింగ్స్ కు మంచి పేరుంది. ధోనీ నాయకత్వంలో ప్రత్యర్థికి ఏమాత్రం తలవంచకుండా, స్కోరు బోర్డును అమాంతం పరుగులెత్తించగల సురేష్ రైనాకు బ్యాటింగ్ లో బిల్లిగ్స్, మురళీ విజయ్, షేన్ వాట్సన్, బ్రావో, డుప్లెసిస్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, ధోనీలు అండగా నిలిచి, బ్యాటింగ్ భారం పంచుకోనున్నారు.

బౌలింగ్ లో బ్రావో, ఇన్ గిడి, శార్థుల్ ఠాకూర్ పేస్ భారం మోయగా, దిగ్గజ హర్భజన్, రవీంద్ర జడేజా స్పిన్ విభాగాన్ని పటిష్ఠం చేశారు. ఇక జట్టు వివరాల్లోకి వెళ్తే... ధోనీ (కెప్టెన్), హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, ధ్రువ్‌ షోరే, రవీంద్ర జడేజా, కరణ్‌ శర్మ, క్షితిజ్‌ శర్మ, నారాయణ్‌ జగదీశన్, కేఎం ఆసిఫ్, చైతన్య బిష్ణోయ్, దీపక్‌ చహర్, మోను కుమార్, కనిష్క్‌ సేథ్, శార్దుల్‌ ఠాకూర్‌ లకు విదేశీ ఆటగాళ్లైన డుప్లెసిస్, డ్వెన్ బ్రావో, షేన్ వాట్సన్, బిల్లింగ్స్, లుంగి ఇన్‌ గిడి, ఇమ్రాన్ తాహిర్, మార్క్‌ వుడ్‌ లు భాగమయ్యారు.

 2008 నుంచి నిషేధానికి గురైన ఈ జట్టు 2015 వరకు ఎనిమిది సీజన్లు ఆడి, రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. నాలుగుసార్లు రన్నరప్‌ గా నిలిచి ఆకట్టుకుంది. మరో రెండు సార్లు సెమీఫైనల్స్‌ కు అర్హత సాధించింది. ధోనీ కెప్టెన్సీ ఈ జట్టుకు అదనపు బలం. పిచ్ లపై పూర్తి అవగాహన, అందుబాటులో ఉన్న వనరుల్ని చాకచక్యంగా వాడుకోవడంలో ధోనీని మించిన ఆటగాడు లేడన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి విజేతగా నిలిచి కోల్పోయిన కీర్తి ప్రతిష్ఠలు సొంతం చేసుకోవాలని ధోనీ సేన భావిస్తోంది.

  • Loading...

More Telugu News