Telangana: మరో నాలుగు రోజుల పాటు వర్షాలు!
- ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులకు అవకాశం
- కొన్ని చోట్ల వడగళ్లకూ చాన్స్
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- వాతావరణ శాఖ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని, కొన్ని చోట్ల వడగళ్లు కూడా పడవచ్చని అధికారులు అంచనా వేశారు.
ఉపరితల అల్పపీడన ద్రోణి కారణంగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, పిడుగులు పడతాయని, హెచ్చరికలు వచ్చిన ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత నైరుతి సీజన్ లో కృష్ణా, గోదావరి బేసిన్ లో సంతృప్తికర వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, వాతావరణ నిపుణులు అంచనా వేశారు. గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతమైన తెలంగాణలో నాలుగు నెలల నైరుతి సీజన్ లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నట్టు వెల్లడించారు.