Congress: ఆన్ లైన్ లో యోగి ఆదిత్య నాథ్ ఏం వెతుకుతారో చూడండి!: కాంగ్రెస్ వ్యంగ్య ట్వీట్
- యోగిపై సెటైరికల్ వీడియో
- కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ కు నెటిజన్ల నుంచి ఆదరణ
- సోషల్ మీడియాలో వైరల్ ట్వీట్
సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నాయి. తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పాలన్నా, ప్రత్యర్థి పార్టీలను తూర్పారబట్టాలన్నా సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదిత్యనాథ్ ఫొటోను మార్ఫింగ్ చేసిన కాంగ్రెస్ పార్టీ, నూడుల్స్ సెర్చ్ ఇంజిన్ లో ద్వేషపూరిత ప్రసంగాలను, రెచ్చగొట్టే ప్రసంగాలు ఎలా చేయాలి? అనే అంశాన్ని వెదుకుతున్నట్టున్న వీడియోను పోస్టు చేసి, దానికి 'ఆన్ లైన్ లో యోగి దేని కోసం సెర్చ్ చేస్తారో చూడండి' అంటూ వ్యాఖ్యను జత చేసింది. దీంతో ఇది వైరల్ అయింది. ఈ వీడియోలో యోగి ప్రభుత్వంలో చోటుచేసుకున్న పలు అంశాలను ప్రస్తావించడం విశేషం.