ashok gajapathi raju: అశోక్ గజపతిరాజుకు క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా
- నిన్న ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన అశోక్ గజపతి రాజు
- బ్యాగేజీలో ఒక బ్యాగ్ మిస్
- క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా
మొన్నటి వరకు భారత విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన అశోక్ గజపతిరాజుకు ఎయిరిండియా సిబ్బంది షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం భార్య, కూతురు, సోదరితో కలసి ఎయిరిండియా-451 విమానంలో ఆయన ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయల్దేరారు. ఈ సందర్భంగా 9 బ్యాగులను లగేజీలో బుక్ చేశారు. తీరా విశాఖ చేరుకున్నాక లగేజీలో ఒక బ్యాగ్ మిస్ అయింది.
ఈ విషయాన్ని ఆయన ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, వారు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఎయిరిండియా యాజమాన్యం అశోక్ కు క్షమాపణలు చెప్పింది. లగేజీని జాగ్రత్తగా చేరుస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ఎయిరిండియా నిర్వాకంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మాజీ విమానయాన శాఖ మంత్రికే ఇలా జరిగితే... సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.