India: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో.. చైనాను వెనక్కినెట్టి తొలి స్థానానికి చేరుకున్న భారత్
- త్వరలో కామన్వెల్త్ దేశాల అధినేతల సదస్సు
- 'వాణిజ్య సమీక్ష -2018' విడుదల
- గ్రీన్‌ఫీల్డ్ ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో చైనాను మించిన భారత్
- ఎఫ్‌డీఐలకు బ్రిటన్ తర్వాత రెండో అతిపెద్ద వనరు భారత్
ఈ నెల 16 నుంచి 18 వరకు లండన్‌లో కామన్వెల్త్ దేశాల అధినేతల సదస్సు (చోగామ్) జరగనున్న నేపథ్యంలో 'వాణిజ్య సమీక్ష -2018' పేరిట చోగామ్ ప్రతినిధులు ఓ నివేదికను విడుదల చేశారు. కామన్వెల్త్ 53 దేశాల కూటమిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)కి సంబంధించి, అత్యధిక విదేశీ పెట్టుబడులు ఆకర్షించిన దేశంగా బ్రిటన్ తరువాత నిలిచి భారత్ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. అంతేగాక, 2015లో గ్రీన్‌ఫీల్డ్ ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో చైనాను అధిగమించి భారత్ తొలిస్థానానికి చేరినట్లు అందులో పేర్కొన్నారు.
భారత ఆర్థిక వృద్ధి కారణంగా 2020 నాటికి సభ్య దేశాల మధ్య వాణిజ్యం విలువ 70వేల కోట్ల డాలర్లకు చేరుతుందని తెలిపింది. అంతేగాక, బ్రిటన్ తరువాత భారత్ రెండో అతిపెద్ద వనరుగా నిలిచింది. సేవల రంగం విషయంలో కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, బ్రిటన్లను వెనక్కి నెట్టి భారత్ తొలిస్థానంలో నిలిచింది.