Kamal Haasan: ప్రధానికి కమలహాసన్ వీడియో సందేశం

  • కావేరీ జల వివాదంలో న్యాయం చెయ్యండి
  • తమిళులకు అనుకూలంగా తీర్పు వచ్చింది
  • కర్ణాటకలో ఎన్నికల నేపథ్యంలో తీర్పు అమలు కావడం లేదు

కావేరీ జ‌ల వివాదంలో తమిళనాడుకు న్యాయం చెయ్యాలని విశ్వ‌నటుడు, ‘మ‌క్క‌ల్ నీది మ‌య్యం’ పార్టీ అధినేత క‌మ‌ల హాస‌న్ ప్ర‌ధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఒక వీడియో సందేశం ద్వారా ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ, ‘‘గౌర‌వ‌నీయులైన ప్ర‌ధానమంత్రికి.. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు న్యాయం కోసం పోరాడుతున్నారు. వారు కోరుకున్న తీర్పు వెలువడింది. అయినప్పటికీ దానిని అమ‌లు చేయ‌డం లేదు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేపథ్యంలో తీర్పు అమలులో జాప్యం జరుగుతోందని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు. ప్రజల్లో ఈ రకమైన ఆలోచన రావడం చాలా ప్రమాదకరం. అవమానకరం కూడాను. మీరు మార్పు తీసుకొస్తార‌ని ఆశిస్తున్నా’’ అంటూ ఆ వీడియోలో క‌మ‌ల హాస‌న్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News