gold: పెరిగిపోతోన్న బంగారం ధర
- అక్షయ తృతీయ నేపథ్యంలో పసిడికి డిమాండ్
- 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.32,150గా నమోదు
- కిలో వెండి ధర రూ.240 పెరిగి రూ.40 వేలుగా నమోదు
బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రోజు బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర మరో రూ.300 పెరిగి రూ.32,150గా నమోదైంది. అక్షయ తృతీయ నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగిందని, స్థానిక వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరోవైపు వెండి ధర కూడా తిరిగి బంగారం బాటలోనే పయనించి కిలో ధర రూ.240 పెరిగి రూ.40 వేలుగా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగిందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.02 శాతం పెరిగి 132.80 డాలర్లుగా నమోదైంది.