Pawan Kalyan: విజయనగనం, అనంతపురం, ఒంగోలు సభలు వాయిదా: పవన్ కల్యాణ్

  • 16న జరిగే బంద్ కు జనసేన మద్దతు
  • నరేంద్ర మోదీని నమ్మే పరిస్థితి లేదు
  • హోదా కోసం ఏం చేసినా అండగా ఉంటా
  • జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఈనెల 16న జరగనున్న రాష్ట్ర బంద్ కు మద్దతివ్వాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అందుకోసం అంతకన్నా ముందు పలు ప్రాంతాల్లో తలపెట్టిన సభలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. బంద్ కు మద్దతుగా విజయనగరం, ఒంగోలు, అనంతపురం పట్టణాల్లో నిర్వహించ తలపెట్టిన అన్ని కార్యక్రమాలనూ నిలిపివేసినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. వామపక్షాల నేతలతో సమావేశమైన పవన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైతు, కార్మికుల సమస్యలపై పోరాటానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పిన ఆయన, ప్రత్యేక హోదా సాధన కోసం జరిగే ఏ కార్యక్రమానికైనా తాము మద్దతిస్తామని అన్నారు.

 తాను ఓ నిస్సహాయుడిని అన్నట్టుగా నరేంద్ర మోదీ నిరసనలకు దిగడం ఏంటని ప్రశ్నించిన ఆయన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో పాలకులే నిరసనలకు దిగడం నమ్మశక్యంగా లేవని వ్యాఖ్యానించారు. వాళ్లే ప్రభుత్వాలని నడుపుతూ, వారే నిరసనలకు దిగుతూ ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. తామే బాధితులం అన్నట్టుగా వారు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మోదీ వైఖరిని ఇప్పుడు ప్రజలంతా అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ప్రజలు బలమైన వ్యక్తిగా భావించి నరేంద్ర మోదీని ఎన్నుకున్నారని, వారి ఆశలను నెరవేర్చలేకపోయారని నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చుంటే ఎన్నో నిజాలు బయటకు వచ్చుండేవని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News