digvijay singh: దిగ్విజయ్ సింగ్ భార్యను 'ఐటెం' అని సంబోధించిన బీజేపీ ఎంపీ

  • మధ్యప్రదేశ్ కు దిగ్విజయ్ చేసిందేమీ లేదు
  • ఢిల్లీ నుంచి ఒక ఐటెంను మాత్రం పట్టుకొచ్చారు
  • బీజేపీ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ మనోహర్ ఉంత్వాల్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ భార్య గురించి బీజేపీ ఎంపీ మనోహర్ ఉంత్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ కు ఇప్పటివరకు దిగ్విజయ్ చేసిందేమీ లేదని... ఢిల్లీ నుంచి ఒక ఐటెంను మాత్రం పట్టుకొచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ టీవీ యాంకర్ అమృత రాయ్ ను ఆయన రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

మోదీ దీక్షకు మద్దతుగా చేపట్టిన దీక్షలో మనోహర్ మాట్లాడుతూ, రెండు సార్లు మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ దిగ్విజయ్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు కలకలం రేపుతున్నాయి. అయితే, ఆయన వ్యాఖ్యలపై ఇంతవరకు బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు.
digvijay singh
amritha rai
manohar untwal
BJP

More Telugu News