Chandrababu: గుజరాత్ లో విగ్రహానికే 2,500 కోట్లు.. ఏపీ రాజధాని నిర్మాణానికి 1500 కోట్లు.. న్యాయమా?: చంద్రబాబు

  • ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు
  • ప్రత్యేకహోదాను తుంగలో తొక్కారు
  • కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహాయనిరాకరణ చేస్తోంది 

ఆనాడు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టంపై రాజ్యసభలో గట్టిగా మాట్లాడారని భావించి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మన ఆశలు అడియాశలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా సింగపూర్‌ తెలుగుదేశం ఫోరం సభ్యులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ, అవినీతి మకిలి అంటిన పార్టీలు, నేతలు మాత్రమే వారి నియంత్రణలో ఉండాలని బీజేపీ భావిస్తోందని అన్నారు.

గుజరాత్‌ లో ఒక విగ్రహం నెలకొల్పడానికి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ లో అమరావతి నిర్మాణానికి 1,500 కోట్ల రూపాయలు ఇవ్వడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని చూసి అసూయతో ప్రత్యేకహోదాను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మోకాలడ్డిన కేంద్ర ప్రభుత్వం, సహాయ నిరాకరణ చేస్తోందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News