Air India: ఎయిరిండియాను రిలయన్స్‌కు కట్టబెట్టే యత్నాలు షురూ?

  • ఎయిరిండియాలో 76 శాతం షేర్ల విక్రయానికి ప్రభుత్వం రెడీ
  • రిలయన్స్‌తో కలిసి బిడ్డింగ్‌కు ఎతిహాద్ ఎయిర్‌వేస్
  • అనుమానం వ్యక్తం చేస్తున్ననిపుణులు

నష్టాల్లో కూరుకుపోయి విక్రయానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను రిలయన్స్‌కు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందా? అంటే.. అవుననే అంటున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ ద్వారా రిలయన్స్‌కు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం ఎయిరిండియా విషయంలోనూ అదే పనిచేసేందుకు సిద్ధమైందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిలయన్స్‌తో ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆ సంస్థతో జట్టు కట్టడం ద్వారా ఎయిరిండియాను చేజిక్కించుకోవాలని గల్ఫ్ ఎయిర్‌లైన్స్ ఎతిహాద్ ప్రయత్నాలు ప్రారంభించింది.

ఎయిరిండియాలో 76 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా జరుగుతున్న బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఎతిహాద్ ఎయిర్‌వేస్ పావులు కదుపుతోంది. రిలయన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా డీల్ ఓకే చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రిలయన్స్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, ఈ రెండు సంస్థల మధ్య జరుగుతున్న చర్చల విషయం తెలిసి కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిలయన్స్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం పథకం ప్రకారం పావులు కదుపుతోందని చెబుతున్నారు. వచ్చే నెల 14తో బిడ్డింగ్ ముగియనుండడంతో ఈ రెండు సంస్థలు ఒక్కటైతే ఎయిరిండియాను చేజిక్కించుకోవడం ఖాయమని అంటున్నారు.

  • Loading...

More Telugu News