posco: చిన్నారులపై లైంగిక దాడి చేస్తే మరణశిక్ష!.. పోస్కో చట్టానికి సవరణ చేయాలంటున్న మేనకాగాంధీ
- ప్రస్తుతం 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి జీవితఖైదు
- ఇకపై మరణశిక్ష విధించాలన్న మేనకా గాంధీ
- 'పోస్కో చట్టం'లో మర్పులు చేయాలన్న మంత్రి
కథువా గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను జనవరి 10న అపహరించిన దుండగులు పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో... 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడివారికి మరణశిక్ష విధించేలా 'పోస్కో చట్టం'లో మార్పులు చేయాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ సూచించారని తెలుస్తోంది.
జమ్మూలోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారంతో తీవ్ర ఆవేదన చెందిన ఆమె, ‘పోస్కో చట్టం’లో మార్పులు చేస్తూ, నిబంధనావళిని ఖరారు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు ట్విట్టర్ లో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న ‘పోస్కో చట్టం’ ప్రకారం చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి గరిష్ఠంగా జీవితఖైదు మాత్రమే విధించగలరు.