Russia: చేసిన దాడులకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: రష్యా హెచ్చరిక

  • సిరియాపై అమెరికా దాడి
  • అమెరికా తమని బెదిరించే ప్రయత్నం చేస్తోందని రష్యా వ్యాఖ్య
  • పుతిన్‌ని అవమానిస్తే అంగీకరించబోమని హెచ్చరిక

ఇటీవల సిరియాలోని దౌమాలో రసాయనిక దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా సిరియాపై దాడి చేస్తామని ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్... సిరియా అధ్యక్షుడు అసద్ లాంటి వారికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకు అండగా నిలుస్తున్నారంటూ నిలదీశారు. ట్రంప్ చర్యపై స్పందించిన రష్యా..  ఈ దాడులకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

మరోసారి అమెరికా తమని బెదిరించే ప్రయత్నం చేస్తోందని అమెరికాలో రష్యా రాయబారి ఆంటోలీ ఆంటోనోవ్‌ వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడిని అవమానిస్తే తాము ఏమాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు. దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, సిరియాపై అమెరికా బీ1 బాంబర్లు, టోర్నడో జెట్స్‌, క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News