Arvind Kejriwal: టీ, స్నాక్స్‌కి ఏకంగా రూ.1.03 కోట్ల ఖర్చు చేసిన కేజ్రీవాల్ కార్యాలయం
- 2015-16లో రూ.23.12 లక్షల ఖర్చు
- 2016-17లో రూ.46.54 లక్షలు
- ఆర్టీఐ ద్వారా వెల్లడి
అతిథులకు ఇచ్చే టీ, స్నాక్స్ కోసం చేసిన ఖర్చు విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన ఇప్పటివరకు టీ, స్నాక్స్ కోసం ఏకంగా రూ.1.03 కోట్ల ఖర్చు చేశారని వెల్లడైంది. 2015-16లో సీఎం కార్యాలయం వీటి కోసం రూ.23.12 లక్షలు ఖర్చు చేయగా, 2016-17లో రూ.46.54 లక్షలు ఖర్చు చేయడంతో అప్పట్లో కేజ్రీవాల్ వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. 2017-18లో కేజ్రీవాల్ ఆఫీసు రూ.33.36 లక్షలు ఖర్చు చేసింది. దీంతో ఈ ఖర్చు మొత్తం రూ.1.03 కోట్లుగా నమోదైంది.
హేమంత్ సింగ్ గౌనియా అనే ఓ సామాజిక కార్యకర్త.. టీ, స్నాక్స్ కోసం కేజ్రీవాల్ ఆఫీసు చేస్తోన్న ఖర్చు ఎంత? అనే విషయంపై ఆర్టీఐకు దరఖాస్తు చేయగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఢిల్లీ సీఎం ఆఫీసు ఈ ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని హేమంత్ అన్నారు. రోజులో ఒక్క పూట కూడా భోజనం చేయలేని వారికి ఈ డబ్బుని ఖర్చు చేయాలని, ప్రభుత్వం ఈ వ్యయాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.