Lawyer: నన్ను కూడా రేప్ చేసి చంపేస్తారు!: కథువా రేప్ కేసు లాయర్ దీపిక
- కథువా రేప్ కేసులో బాధితుల పక్షాన వాదిస్తున్న దీపిక
- బెదిరింపుల విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పనున్న న్యాయవాది
- కేసు నుంచి తప్పుకోవాలని జమ్ము బార్ అసోసియేషన్ నుంచి బెదిరింపులు
కథువా రేప్ కేసులో బాధితుల పక్షాన వాదిస్తున్న లాయర్ దీపిక ఎస్.రాజావత్ తన ప్రాణాలకు హాని ఉన్నట్టు చెప్పారు. తనను కూడా రేప్ చేసి చంపేందుకు కుట్ర జరుగుతున్న విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పనున్నట్టు తెలిపారు. ‘‘ఎప్పటి వరకు బతికి ఉంటానో నాకు తెలియదు. నన్ను కూడా తప్పకుండా రేప్ చేసి చంపేస్తారు. నిన్ను క్షమించబోమని నన్ను హెచ్చరించారు. నా ప్రాణాలకు హాని ఉన్న విషయాన్ని నేడు సుప్రీంకోర్టుకు చెబుతా’’ అని దీపిక పేర్కొన్నారు.
ఇటీవల దీపిక మాట్లాడుతూ కథువా కేసును వాదిస్తున్న తనను జమ్ము బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఎస్ స్లాథియా హెచ్చరించినట్టు ఆరోపించారు. ‘‘జమ్ము బార్ అసోసియేషన్‌లో నేను సభ్యురాలిని కాను. కానీ బుధవారం స్లాథియా నన్ను హెచ్చరించారు. ఈ కేసు నుంచి దూరంగా జరగాలని బెదిరించారు. అయితే నేనతడికి జవాబుదారీని కాను. నా క్లైయింటుకు మాత్రమే నేను జవాబుదారీని’’ అని తెలిపారు. కాగా, దీపిక ఆరోపణలను బార్ కౌన్సిల్ ఖండించింది.