xiomi: ఏడు నెలలకే నిలిచిపోయిన ఎంఐ ఏ1 స్మార్ట్ ఫోన్ల విక్రయాలు
- గతేడాది ఆవిష్కరించిన కంపెనీ
- ఎంఐ వెబ్ సైట్లో, ఫ్లిప్ కార్ట్ నుంచి అదృశ్యం
- ఈ నెలలోనే ఎంఐ ఏ2 విడుదల
చైనా కంపెనీ షియోమీ విడుదల చేసిన ఏడు నెలలకే ఎంఐ ఏ1 ఫోన్ల విక్రయాలను నిలిపేసింది. ఎంఐ విడుదల చేసిన తొలి ఆండ్రాయిడ్ ఓరియో ఫోన్ ఇది. ఈ ఏడాది మొదట్లో ఆండ్రాయిడ్ వెర్షన్ అప్ డేట్ సదుపాయం కూడా కల్పించింది. అయితే, తాజాగా ఈ ఫోన్ల అమ్మకాలు అటు ఎంఐ వెబ్ సైట్లోనూ, ఇటు ఫ్లిప్ కార్ట్ లోనూ అందుబాటులో లేవు.
ఏ1లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంది. అతి స్వల్ప కాలంలోనే ఓ ఫోన్ విక్రయాలను షియోమీ నిలిపివేయడం ఇదే మొదటి సారి. అయితే, ఏ1కు కొనసాగింపుగా ఎంఐ ఏ2 ఫోన్ ను కంపెనీ ఈ నెల చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది. విడుదలకు సంబంధించి కంపెనీ సంకేతం కూడా ఇచ్చింది. ఎంఐ ఏ2 కూాడా ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోనే. ఓరియో 8.1 పై పనిచేస్తుంది.