amaravati: ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
- యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ పాలసీకి ఆమోదం
- ఆక్వా పాలసీకి గ్రీన్ సిగ్నల్
- ఇళ్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఇందులో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ పాలసీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆక్వా పాలసీపై చర్చించిన మంత్రివర్గం ఆ పాలసీకి ఆమోద ముద్ర వేసింది. పట్టణాల్లో పీఎంఏవై కింద నిర్మించే ఇళ్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు ఆమోదం తెలిపింది. అలాగే, ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి కీలక చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ కేసు విషయంలో హైకోర్టులో వ్యవహరించాల్సిన తీరుపై నిర్ణయం తీసుకోనున్నారు.