Sri Reddy: ఉసిగొల్పితే పోయేది మీ పరువు తప్ప నాకేం కాదు.. తెగించి వచ్చా!: శ్రీరెడ్డి
- అమ్మాయిల స్వాతంత్ర్యం ఎంతో అర్థమైంది
- ఫ్యాన్స్ చిల్లర పనులతో ఆయనకే నష్టం
- ఆడదాని ఏడుపుకు రాజ్యాలే కూలిపోయాయి
- పోయేది మీ పరువే: పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డ శ్రీరెడ్డి
అమ్మాయిలు నోరు తెరిస్తే ఎవరూ తట్టుకోలేకపోతున్నారని, ఆడవారికి ఉన్న స్వాతంత్ర్యం ఎంతన్నది తనకు ఇప్పటికి అర్థమైందని టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై పోరాటాన్ని ప్రారంభించిన శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి వ్యాఖ్యానించింది. పవన్ కల్యాణ్ తల్లిని విమర్శించిన తరువాత, ఆయన ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ను చూసి తనకు భయం వేస్తోందని తెలిపింది.
తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఉదయం 8.45 గంటల సమయంలో ఓ పోస్టు పెడుతూ "వావ్... ఈ రోజు అర్థమైంది. మా లేడీస్ కు ఉన్న ఇండిపెన్డెన్స్ గురించి. అమ్మాయిలు నోరు తెరిస్తే, మీ గూండాగిరి... ఒక అమ్మాయి నంబర్ యూట్యూబులో, వాట్స్ యాప్ గ్రూపుల్లో పెట్టి హింస పెట్టే పెద్ద మనుషుల్లారా... మీ లాగా ఎవరూ టార్చర్ చేయలేరని నిరూపించారు... పీకే ఫ్యాన్స్ చేసే ఈ చిల్లర పనుల వల్ల ఎంత నష్టమో చూపిస్తాం. నేను ఒక్కదాన్ని. మీరు ఎంత మందో. ఒక ఆడదాన్ని ఏడుపుకు రాజ్యాలు కూలిపోయాయి. ఉసిగొల్పితే పోయేది మీ పరువు తప్ప నాకేం కాదు. ఈ పురుషాధిక్యత ఎంత కాలమో చూస్తాం" అని వ్యాఖ్యానించింది.
ఆపై మరో పోస్టులో "చదువుకున్న కొంతమంది నీచులారా, మూర్ఖులారా, మీ బుర్రకి క్లీనింగ్ స్పిరిట్ తో అభిషేకం చేయండి. రోగానికి మందు వేసుకోండి. అభిమానం ముసుగులో మీరు చేసే అకృత్యాలకు ఎవరం భయపడం. పంజా విసురుతాం అన్యాయాలపై, అసమానతలపై... మీ నేత అస్తమించే టైమ్ దగ్గర్లోనే ఉంది. ఒక నిస్సహాయ ఆడపిల్ల మీద ఎంత జులుమో చూస్తాం. పవన్ కంట్రోల్ చేయకపోతే దీన్ని తేలికగా తీసుకునేది లేదు" అని హెచ్చరించింది. "నా జీవితంలో అనుభవించిన బాధ కన్నా, మీరు తిట్టే తిట్లు నా --తో సమానం. తెగించి వచ్చా" అని మరో పోస్టు పెట్టింది.