illiana: ఇలియానా తల్లి కానుందా?... బీటౌన్ లో గుసగుసలు!
- ఆండ్రూ నీబోన్ తో సహజీవనం చేస్తున్న ఇలియానా
- సోషల్ మీడియాలో ఆండ్రూని హబ్బీ అంటూ సంబోధన
- ఇలియానా ఫొటో పోస్టు చేసిన ఆండ్రూ నీబోన్
ప్రముఖ నటి ఇలియానా తల్లి కాబోతోందా? అంటూ బీటౌన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గత కొంత కాలంగా ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాహం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఇలియానా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ, ‘హబ్బీ’ (భర్త) అని సంబోధిస్తుంటుంది.
ఈ నేపథ్యంలో ఇల్లీ బేబీ ప్రెగ్నెంట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ‘రెయిడ్’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఇలియానా, తాను గర్భం దాల్చిన సంగతి తెలీకుండా ఉండేందుకు తేలికైన దుస్తులు ధరించిందని బీటౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాకుండా ఆండ్రూ తన ఇన్ స్టాగ్రామ్ లో తన భార్య ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో ఇలియానా బాత్ టబ్ లో కాఫీ తాగుతూ సేదదీరుతోంది. ఆ ఫొటోకు ఆండ్రూ, ‘ఇలియానా ఏకాంతంగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె గర్భం దాల్చినట్లు నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.