KTR: అరుణ్‌జైట్లీ ట్వీట్‌పై కౌంటర్ ఇచ్చిన తెలంగాణ మంత్రి కేటీఆర్
- బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఉంది
- ఇది ఆకస్మికంగానో లేక తాత్కాలికంగానో రాలేదు
- మూడు నెలలుగా హైదరాబాద్‌లో తరుచూ ఫిర్యాదులు వచ్చాయి
- ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలించాలి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో సరిపడినంత నగదు చలామణిలో ఉందని, బ్యాంకుల వద్ద అందుబాటులో ఉందని పేర్కొంటూ ఈ రోజు జైట్లీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేటీఆర్ స్పందిస్తూ... బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగానో లేక తాత్కాలికంగానో రాలేదని, ఈ విషయమై మూడు నెలలుగా హైదరాబాద్‌లో తరుచూ ఫిర్యాదులు వచ్చాయని ట్వీట్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా వమ్ము చేస్తోన్న సమస్యపై ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలించాలని ఆయన అన్నారు.