vijay lakshmi: 'రబ్బరు గాజులు' సాంగును ముందుగా నేను పాడాను .. నా వాయిస్ లేకపోవడానికి కారణం అదే: సింగర్ విజయలక్ష్మి
- దలేర్ మెహందీ శృతి ఎక్కువగా ఉంటుంది
- ఆయనతో కలిసి మళ్లీ పాడవలసి వచ్చింది
- సమయం లేకపోవడంతో కుదర్లేదు
ఒకసారి ఒక పాటను ఒక సింగర్ పాడేసిన తరువాత .. కొన్ని కారణాల వలన, ఆ వాయిస్ ను తీసేసి మరో సింగర్ తో పాడించడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సింగర్స్ కి ఈ అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అలా కొంతమంది సింగర్స్ కొన్ని మంచి సాంగ్స్ ను మిస్ అవుతుంటారు. అలా 'యమదొంగ' సినిమాలోని 'రబ్బరుగాజులు' సాంగును మిస్ అయినట్టుగా 'ఆలీతో సరదాగా'లో విజయలక్ష్మి చెప్పారు.
" 'రబ్బరు గాజులు' పాట నేను పాడటం .. ఓకే కావడం జరిగిపోయింది .. ఆ రోజు రాత్రి నేను మణిశర్మ టీమ్ తో కలిసి అమెరికా బయల్దేరవలసి వుంది. ఆ సాయంత్రం దలేర్ మెహందీ వచ్చి హీరో వెర్షన్ పాడటం మొదలెట్టారు. ఆయన శృతి ఎక్కువగా ఉండటంతో .. అందుకు తగినట్టుగా మళ్లీ నన్ను పాడమని కీరవాణి గారు చెప్పారు. నేను ప్రయత్నం చేశానుగానీ .. అప్పటికే ఫ్లైట్ టైమ్ అవుతుండటం వలన కుదరలేదు. అందుకే నేను పాడినది తీసేయవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.