Twitter: భారత్ సహా చాలా దేశాల్లో కాసేపు మొరాయించిన ట్విట్టర్.. ఫిర్యాదులు
- ఈశాన్య అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ట్విట్టర్ డౌన్
- ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సాంకేతిక సమస్య
- పది నిమిషాల పాటు స్తంభించిన ట్విట్టర్
ప్రపంచంలో చాలా దేశాల్లో సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు యూజర్లు ట్విట్టర్ ఓపెన్ చేయలేకపోయారు. ముఖ్యంగా భారత్‌లో పాటు, ఈశాన్య అమెరికా, యూకే, ఫ్రాన్స్, జపాన్ దేశాల్లో ఐదు నుంచి పది నిమిషాలు ట్విట్టర్ పనిచేయకపోవడంతో యూజర్ల నుంచి ఆ సంస్థకు ఫిర్యాదులు వచ్చాయి. టెక్నికల్ సమస్య వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని డౌన్‌డిటెక్టర్ రిపోర్టు పేర్కొంది. ఆండ్రాయిడ్ యాప్ నుంచి ట్విట్టర్ కు అధికంగా ఫిర్యాదులు వచ్చాయని, అలాగే ఐప్యాడ్ యాప్‌లో కూడా ఇదే పరిస్థితి తలెత్తిందని డౌన్‌డిటెక్టర్ చెప్పింది.
ఈ సమస్య ఎందుకు తలెత్తిందన్న విషయంపై ట్విట్టర్ ఇప్పటికీ ప్రకటన చేయలేదు. కొంత సాంకేతిక సమస్య ఉందని, తాము దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని ట్విట్టర్ పేర్కొన్న విషయం మాత్రం ఆ సైట్‌ను ఓపెన్ చేసిన వారికి కనపడింది.