ameerpet to nims: రేపటి నుంచి అమీర్ పేట - నిమ్స్ మార్గంలో భారీ వాహనాలకు నో ఎంట్రీ

  • భూగర్భ కేబుళ్ల పనులు.. భారీ వాహనాలను అనుమతించం  
  • ఈ నిబంధనలు మే 31 వరకు అమల్లో ఉంటాయి
  • హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్

రేపటి నుంచి అమీర్ పేట - నిమ్స్ మార్గంలో భారీ వాహనాలను అనుమతించడం లేదని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రకటించారు. ఈ నిబంధనలు రేపటి నుంచి మే 31 వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. విద్యుత్ శాఖకు సంబంధించిన భూగర్భ కేబుళ్ల పనులలో భాగంగా శ్రీనగర్ కాలనీరోడ్ నుంచి నిమ్స్ ఆసుపత్రి మార్గంలో భారీ వాహనాలను అనుమతించడం లేదని అన్నారు. ఆర్టీసీ బస్సులను ఏ మార్గాల్లో మళ్లిస్తారో ఆయన వివరించారు. వాటి వివరాలు..
 
* సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్ చెరు నుంచి వచ్చే ఆర్టీసీ, జిల్లా బస్సులను కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద మళ్లించనున్నారు. అవి నర్సాపూర్ క్రాస్ రోడ్, బాలానగర్, ఫిరోజ్ గూడ, బోయిన్ పల్లి జంక్షన్, తాడ్ బండ్ జంక్షన్, సీటీఓ జంక్షన్, ప్యారడైజ్ హోటల్ జంక్షన్, ఎంజీ రోడ్ మీదుగా వెళతాయి.

* పటాన్ చెరు, మియాపూర్, కూకట్ పల్లి నుంచి అమీర్ పేట్, పంజాగుట్ట మీదుగా ఆంధ్రా, రాయలసీమలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మైత్రివనం వైపు వెళ్లకుండా ఎస్ ఆర్ నగర్ గౌతం డిగ్రీ కాలేజ్ ఎదురుగా యూటర్న్ తీసుకుని, ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉంటుంది.

* పటాన్ చెరు, మియాపూర్, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ భారీ వాహనాలు ఎస్ఆర్ నగర్ క్రాస్ రోడ్ నుంచి కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బి సిగ్నల్, సోనాబాయి ఆలయం, అమీర్ పేట్ జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, డీకే రోడ్ జంక్షన్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, ఐటీసీ కాకతీయ షెరటాన్ మీదుగా ఖైరతాబాద్ కు చేరుకోనున్నాయి.

* కృష్ణానగర్ నుంచి వచ్చే ఆర్టీసీ, ఇతర భారీ వాహనాలు శ్రీనగర్ కాలనీ జీహెచ్ఎంసీ పార్క్ నుంచి శ్రీనగర్ టీ జంక్షన్, ఎంజే ఇంజనీరింగ్ కాలేజ్, నాగార్జున సర్కిల్, జీవీకే వన్ మాల్, తాజ్ కృష్ణా జంక్షన్ మీదుగా ఖైరతాబాద్ కు వెళ్లనున్నాయి.

* కృష్ణానగర్ నుంచి బేగంపేట, ఎస్ఆర్ నగర్ వైపు వెళ్లాల్సిన వాహనాలను కృష్ణానగర్ క్రాస్ రోడ్డు నుంచి యూసఫ్ గూడ చెక్ పోస్ట్, యూసఫ్ గూడ బస్తీ, కృష్ణకాంత్ పార్కు మీదుగా వెంగళరావునగర్ వైపు అనుమతిస్తారు.

  • Loading...

More Telugu News