seetaram: ఇక బీజేపీని ఓడించేందుకు అంతా ఏకం కావాలి: సీతారాం ఏచూరి పిలుపు
- మతోన్మాదం, అవినీతి, అక్రమాలపై ఏచూరి ఆగ్రహం
- దళితులు, ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన
- మతోన్మాదం వల్ల దేశ ఐక్యతకు ముప్పని వ్యాఖ్య
- లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని పిలుపు
దేశంలో దళితులు, ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని, ఇటువంటి మతోన్మాదం వల్ల దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్లో సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ... మతోన్మాదుల దాడులను అడ్డుకునే శక్తి వామపక్షాలకు మాత్రమే ఉందని, వర్గ, సామాజిక పోరాటాల కోసం కలిసి పనిచేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు కలవాలని అన్నారు. దేశంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని, మరోవైపు కేంద్ర సర్కారు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు.