BJP: బీజేపీపై విరుచుకుపడి రాజీనామా చేసిన నటి మల్లికా రాజ్‌పుట్.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటన

  • బీజేపీ దళిత, మహిళా వ్యతిరేక పార్టీ
  • ఆ పార్టీపై భ్రమలు తొలగిపోయాయి
  • స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ-ముస్లింల మధ్య చిచ్చు

దేశాన్ని ఊపేస్తున్న కథువా, ఉన్నావో రేప్‌ కేసులకు నిరసనగా
బాలీవుడ్ నటి మల్లికా రాజ్‌పుట్ బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటించిన ఆమె మాట్లాడుతూ.. బీజేపీ చాలా నిజాయతీ గలిగిన పార్టీ అని భావించానని, అందుకే అందులో చేరానని చెప్పారు. అయితే తన భ్రమలు తొలగిపోయాయని, అది మహిళా వ్యతిరేక, దళిత వ్యతిరేక పార్టీ అని అర్థమైందని నిప్పులు చెరిగారు.

మరో నటి కంగనా రనౌత్‌తో కలిసి ‘రివాల్వర్ రాణి’ సినిమాలో నటించిన మల్లిక మహారాష్ట్ర బీజేపీ యూత్ వింగ్‌లో చురుగ్గా పనిచేస్తున్నారు. కథువా, ఉన్నావో గ్యాంగ్ రేప్‌ల నేపథ్యంలో ఓ మహిళగా బీజేపీలో ఉండడం క్షేమం కాదన్న ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్టు వివరించారు. బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తోందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మహిళలను బీజేపీ పావులుగా వాడుకుంటోందన్న మల్లిక ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో ఉండడం సురక్షితం కాదనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News