pinarayi vijayaan: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన కేరళ ముఖ్యమంత్రి
- హైదరాబాదుకు విచ్చేసిన కేరళ సీఎం
- పంజాగుట్ట పీఎస్‌లో స్వాగతం పలికిన హోంమంత్రి, డీజీపీ
- స్టేషన్లో ఉన్న వసతుల గురించి తెలుసుకున్న కేరళ సీఎం
హైదరాబాదులోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేశంలోనే రెండో అత్యుత్తమ పీఎస్‌గా అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ రోజు ఆ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఆయనకు తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. పినరయి విజయన్ ఈ సందర్భంగా స్టేషన్ అధికారులు, సిబ్బందితో కాసేపు మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, కేసుల పరిష్కారాలు, స్టేషన్ లో ఉన్న మౌలిక వసతులను పంజాగుట్ట పోలీసులు ఆయనకు వివరించి చెప్పారు. విజయన్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.