cpm: కేసీఆర్‌ ఫ్రంట్‌పై సీతారాం ఏచూరి విమర్శలు.. కాంగ్రెస్‌ తో పొత్తుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వ్యాఖ్య!

  • జాతీయ ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లలో చేరబోము
  • కేసీఆర్‌ ఫ్రంట్‌ మూసీనది వంటిది
  • సీపీఎం మహాసభల్లో రాజకీయ తీర్మానం గురించి చర్చించాం

దేశంలో కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూటమి ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. కేసీఆర్‌ కూటమిపై స్పందించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దాన్ని మూసీనదితో పోల్చారు. అలాగే, జాతీయ ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లలో చేరే ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీపీఎం మహాసభల్లో రాజకీయ తీర్మానం గురించి చర్చించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు విషయంలో తమ పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చాయని, పార్టీ సభ్యుల ప్రతిపాదనలపై చర్చలు జరుగుతాయని చెప్పారు. పార్టీ పరంగా జరుగుతోన్న లోపాలను సరిదిద్దుకుంటామని సీతారాం ఏచూరి తెలిపారు.

  • Loading...

More Telugu News