Hyderabad: ఆ మార్గాల్లో హైదరాబాద్ మెట్రోరైల్ సేవలు ఆలస్యం: మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
- ఎల్బీనగర్-అమీర్పేట్ మెట్రో లైన్ సేవల ప్రారంభం జూన్లో లేనట్లే
- ఆగస్టులో లైన్ సేవలు అందుబాటులోకి
- మెట్టుగూడ నుంచి అమీర్పేట్ వరకు సీబీటీ టెక్నాలజీ లేదు
హైదరాబాద్ మెట్రోరైల్ మొదటి దశ సేవలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, నగరంలోని ఎల్బీనగర్-అమీర్పేట్ మెట్రో లైన్ సేవల ప్రారంభం మరింత ఆలస్యం కానున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ లైన్ ఈ జూన్లో ప్రారంభం కాదని, సీటీఎస్ టెక్నాలజీతో ఈ ఏడాది ఆగస్టులో లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని వివరించారు.
కాగా, ఇప్పటికే ప్రారంభమైన మెట్రో రైళ్లు చాలా తక్కువ వేగంతో వెళుతున్నాయని విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్టుగూడ నుంచి అమీర్పేట్ వరకు సీబీటీ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో మెట్రో వేగం అక్కడ మాత్రమే కాస్త తక్కువగా ఉందని, అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు మాత్రం వేగంగా వెళుతోందని, మెట్రోరైళ్లలో ప్రతిరోజు 60 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని వివరించారు.