MOTO E5: మోటో ఈ5, ఈ5 ప్లస్ ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే మోడళ్ల ఆవిష్కరణ
- రెండింటిలోనూ 18:9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో
- యూరోప్ లో విడుదల, త్వరలో భారత్ కు
- ఈ5 ప్లే మాత్రం అమెరికా మార్కెట్ కే పరిమితం
లెనోవో కు చెందిన మోటోరొలా కంపెనీ ఈ5, ఈ5 ప్లస్, ఈ5 ప్లే మోడళ్లను యూరోప్ లో విడుదల చేసింది. వీటిలో ఈ5, ఈ5 ప్లస్ ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే (18:9) తో ఉంటాయి. ఈ రెండు ఫోన్లను రానున్న నెలల్లో భారత్ సహా ఆసియా పసిఫిక్ దేశాల్లో విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. ఈ5 ప్లే మాత్రం అమెరికా మార్కెట్ కే పరిమితమని స్పష్టం చేసింది. మోటో ఈ5 ధర 149 యూరోలు. రూపాయిల్లో సుమారు రూ.12,000 . ఈ5 ప్లస్ ధర 169 యూరోలు (రూపాయిల్లో సుమారు రూ.13,700).
ఈ5 ప్లస్ ఫోన్లో సింగిల్ సిమ్, 6 అంగుళాల ఐపీఎస్ 18:9 డిస్ ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బోచార్జ్ ఆప్షన్, ఆండ్రాయిడ్ ఓరియో 8.0, స్నాప్ డ్రాగన్ 435 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 12మెగా పిక్సల్ వెనుక కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ స్టోరేజీ, 4జీ వోల్టే ఉన్నాయి.
మోటో ఈ5లో 5.7 అంగుళాల 18:9 డిస్ ప్లే, వెనుక 13 మెగా పిక్సల్ కెమెరా, ముందు 5 మెగా పిక్సల్ కెమెరా, 4జీ వోల్టే, సింగిల్ సిమ్, డ్యుయల్ సిమ్ తో రెండు వేరియంట్లు, ఎన్ఎఫ్ సీ(సింగిల్ సిమ్ మోడల్ లో మాత్రమే), 2జీబీ ర్యామ్, 1.4 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 425 చిప్ సెట్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.