child rape cases: 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక ఉరిశిక్షే ... చట్టాన్ని సవరించనున్నట్టు కేంద్రం వెల్లడి

  • పోస్కో చట్టంలో ఈ మేరకు సవరణలు
  • సుప్రీంకోర్టుకు లేఖ రూపంలో తెలియజేసిన కేంద్రం
  • ఇటీవలి ఘటనలతో తాను కలత చెందానన్న కేంద్ర మంత్రి మేనకాగాంధీ

దేశవ్యాప్తంగా చిన్నారులపై అఘాయిత్యాలు, దారుణ ఘటనలు పెరిగిపోతుండడం, వీటిపై ప్రజల ఆగ్రహం నేపథ్యంలో కఠిన చట్టానికి కేంద్రం నడుం బిగించింది. 12 ఏళ్లలోపు వయసున్న చిన్నారులపై అత్యాచారం చేసే వారికి ఉరిశిక్ష విధించేలా చట్టానికి సవరణలు చేసే ప్రక్రియను ప్రారంభించినట్టు ప్రభుత్వం తెలిపింది.

ఓ ప్రజాహిత వ్యాజ్యంపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తాను తీసుకుంటున్న చర్యల గురించి లేఖ రూపంలో వివరించింది. 12 ఏళ్లలోపు వారిపై అత్యాచారం చేసిన వారికి గరిష్టంగా ఉరిశిక్ష విధించేలా పోస్కో చట్టాన్ని సవరిస్తున్నట్టు తెలిపింది. కథువాతోపాటు ఇటీవల చిన్నారులపై జరిగిన ఘటనలతో కలత చెందినట్టు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ అన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News