India: బ్యాంకు ఖాతాదారులకు నాణేల రూపంలో చెల్లింపులు
- రూ.100, రూ.500, రూ.2000 నోట్ల కొరత
- విత్ డ్రా చేసుకున్న మొత్తంలో కొంత భాగం కింద నాణేలు
- మధ్యప్రదేశ్ లోని బ్యాంకుల్లో ఇదే తీరు
దేశంలోని తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో నగదు కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయాలు చేపట్టినప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో నగదు కొరత ఉంది. ఏటీఎంలలో డబ్బు లేకపోవడంతో ఖాతాదారులు బ్యాంకులకే వెళ్లాల్సివస్తోంది. నగదు విత్ డ్రాకు చేసుకునే విషయమై చాలా బ్యాంకులు పరిమితి విధించాయి.
పదివేల రూపాయల వరకు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని తమ ఖాతాదారులకు ఆయా బ్యాంకులు నిబంధనలు పెట్టాయి. రూ.100, రూ.500, రూ.2000 నోట్ల కొరత కారణంగా ఖాతాదారులు విత్ డ్రా చేసుకున్న మొత్తంలో కొంత భాగాన్ని నాణేల రూపంలో చెల్లిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని సాగర్, ఛతర్ పూర్, తికమ్ గఢ్ ప్రాంతాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఖాతాదారులకు నాణేలను చెల్లిస్తుండటం గమనార్హం.