Venkaiah Naidu: జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం.. వెంకయ్యకు నోటీసు అందించిన ఆరు పార్టీలు!
- ప్రస్తుత సీజేఐని తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్
- ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలతో కలిసి ప్రయత్నాలు
- 60 మంది రాజ్యసభ సభ్యుల సంతకం
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్తో పాటు ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ విషయంపై ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఛాంబర్లో ఆయా పార్టీల నేతలు భేటీ అయి, అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుపై ఆయా పార్టీలకు చెందిన 60 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేసినట్లు తెలిసింది.
కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు కోర్టు పాలన వ్యవస్థపై అభ్యంతరాలు తెలుపుతూ దేశ చరిత్రలోనే మొదటిసారి నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన విషయం విదితమే. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసుల కేటాయింపులపై వారు పలు ఆరోపణలు చేయడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.