TTD: ఓ క్రిస్టియన్ కి టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం ఎలా ఇస్తారు..?: స్వామిపరిపూర్ణానంద
- నూతన పాలకమండలిని నియమించిన ఏపీ ప్రభుత్వం
- ఏంఎల్ఏ అనితకు సభ్యత్వంపై అభ్యంతరం
- స్వయంగా తాను క్రిస్టియన్ అని ఓ ఇంటర్వ్యూ లో పేర్కొన్న ఏంఎల్ఏ అనిత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ కొత్త పాలకమండలిని నియమించిన సంగతి తెలిసిందే. నూతన పాలకమండలిలో చైర్మన్, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు 14 మంది సభ్యులు ఉన్నారు. అయితే టీటీడీ బోర్డులో ఏంఎల్ఏ అనిత సభ్యత్వం పొందడం పట్ల స్వామి పరిపూర్ణానంద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏంఎల్ఏ అనిత స్వయంగా తాను క్రిస్టియన్ అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకున్న విషయాన్ని స్వామి పరిపూర్ణానంద తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
"టీటీడీ నూతన పాలక మండలిలో ఓ క్రిస్టియన్ కి అవకాశం ఇవ్వడం ఏమిటి?.. ఇది ఏమి గ్రహచర్యం.. ఇది ఏమి న్యాయం?.. హిందువుల మౌనం చేతకానితనంగా భావిస్తున్నారా?.. ప్రశ్నించే సమయం ఆసన్నం అయింది" అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.