Tollywood: సినీ ప్రముఖులు, 'మా'తో ముగిసిన తెలంగాణ మంత్రి తలసాని భేటీ.. కీలక నిర్ణయాలు ప్రకటన

  • ఇక వివాదాన్ని నిలిపివేయాలి
  • ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలి 
  • నటులకు మేనేజర్ల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు
  • ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపుతూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌తో పాటు పలువురు సినీ పెద్దలతో ఈ రోజు చర్చలు జరిపింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

సినీ పరిశ్రమలో మధ్యవర్తులు లేకుండా చూస్తామని, ఇకపై నటులకు మేనేజర్ల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు జరిగేలా చూస్తామని సినీ పెద్దలు చెప్పారని ఆయన అన్నారు. మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇక ఈ వివాదాన్ని ఇక్కడితో నిలిపివేయాలని పరిశ్రమను, మీడియాను కోరుతున్నానని అన్నారు. మహిళలు, నటులు ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
   

  • Loading...

More Telugu News