petrol: మరింత పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు
- నిన్న 55 నెలల గరిష్టానికి చేరుకున్న ధరలు
- ఈ రోజు కూడా మరింత పైకి
- పెట్రోల్ ధరలు ఈ రోజు లీటరుకు రూ.74.21గా నమోదు
- డీజిల్ ధరలు లీటరుకి రూ.65.46గా నమోదు
పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకీ పెరుగుతూ వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. నిన్న 55 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ రోజు కూడా జోరు తగ్గించకుండా పెట్రోల్ ధరలు మరో 13 పైసలు పెరిగి లీటరుకు రూ.74.21గా నమోదుకాగా, మరోవైపు డీజిల్ ధరలను కూడా 15 పైసలు చొప్పున పెరిగి రూ.65.46కు చేరింది. 2013 సెప్టెంబర్ తరువాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటిసారి. పెట్రోల్ ధర పెరుగులకు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అధికమవడమే కారణమని విశ్లేషకులు అంటున్నారు.
ఈ రోజు పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీలో రూ.74.21
కోల్కతాలో రూ.76.91
ముంబయి లో రూ.82.06
చెన్నైలో రూ.76.99
డీజిల్ ధరలు
ఢిల్లీలో రూ.65.46
కోల్కత్తాలో రూ.68.16
ముంబయిలో రూ.69.7
చెన్నైలో రూ.69.06