soudi arebia: సౌదీలో ఘోర వైమానిక దాడి .. శ్మశానంగా మారిన పెళ్లి మంటపం!
- కల్యాణ వేదికపై సౌదీ సైన్యం నేతృత్వంలోని సంకీర్ణ దళాల వైమానిక దాడి
- వివాహానికి హాజరైన బంధుమిత్రులతో కళకళలాడిన ఇల్లు
- బాంబు పడడంతో హాహాకారాలు, ఆర్తనాదాలు
సౌదీ సైన్యం నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ఘోరం చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలోని యెమన్ ఉత్తరప్రాంతంలోని బని ఖయాసి జిల్లాలోని ఒక ప్రాంతంలో ఒక కుటుంబ సభ్యులు వివాహ వేడుక నిర్వహించుకునేందుకు గుమిగూడారు. టెంట్లలో బంధుమిత్రులతో ఆ ప్రాంతం కొలాహలంగా ఉంది.
కాసేపట్లో వివాహం జరుగుతుందనగా, ఊహించని విధంగా ఆ వివాహ వేడుక ప్రాంతంపై వైమానిక దాడి జరిగింది. ఆకాశం నుంచి బాంబు పడడంతో 20 మందికిపైగా అక్కడికక్కడే మృతి చెందగా, మరో 40 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. అంతవరకు కోలహలంగా ఉన్న ఆ ప్రాంతం హాహాకారాలు, రక్షించండన్న అరుపులతో హోరెత్తిపోయింది. క్షతగాత్రులను హజ్జాలోని అల్ జుమ్ హౌరీ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది.