prashanth bhushan: తీర్మానాన్ని తిరస్కరించే అధికారం వెంకయ్యనాయుడికి లేదు: ప్రశాంత్ భూషణ్
- ప్రధాన న్యాయమూర్తి అభిశంసన తీర్మానం తిరస్కరణ
- ఆ సంతకాలు సరైనవేనా? అన్నదే చూడాలి
- ప్రశాంత్ భూషణ్ విమర్శలు
అభిశంసన ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం మేరకు ఈ నోటీసు ఉందా? లేదా? అని పరిశీలించడానికే ఉప రాష్ట్రపతి అధికారాలు పరిమితమవ్వాలి తప్ప..అభిశంసన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పే అధికారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిశంసన తీర్మానంపై ఇచ్చిన నోటీసును వెంకయ్యనాయుడు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ‘‘సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించడానికి 64 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. ఆ సంతకాలు సరైనవేనా? ఆరోపణలు అనుచిత ప్రవర్తనకు సంబంధించినవేనా? అని మాత్రమే ఉప రాష్ట్రపతి చూడాలి. ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పే అధికారం వెంకయ్యకు లేదు’ అని ప్రశాంత్ భూషణ్ వివరించారు.