Theft: ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేసేందుకే దొంగతనాలు: 'తనిష్క్'లో చోరీ చేసిన గజదొంగ

  • ప్రజాసేవ చేయాలన్నదే లక్ష్యం
  • ఎంపీగా గెలిచి ప్రజల తలరాతలు మారుస్తా
  • విచారణలో అంతర్రాష్ట్ర గజదొంగ

"ఎన్నికల్లో నిలబడి, గెలిచి ప్రజా సేవ చేయాలన్నదే నా లక్ష్యం. సామాన్యులకు ఉపయోగపడాలని ఓ ఎన్నికల ప్రణాళికను తయారు చేసుకున్నా. ఎంపీగా గెలిచి ప్రజల తలరాతలు మారుస్తా. ఎన్నికల్లో ఖర్చు కోసమే దొంగతనాలు చేస్తున్నా" 2014లో హైదరాబాద్ లోని తనిష్క్ ఆభరణాల దుకాణంలో భారీ చోరీ చేసి, ఆపై తనంతట తానుగా మీడియా ముందు పోలీసులకు లొంగిపోయిన దొంగ మారగాని సుబ్రహ్మణ్యం చెబుతున్న మాటలివి. ఇటీవల ఓ కేసులో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయగా, విచారణలో ఈ అంతర్రాష్ట్ర గజదొంగ చెప్పిన మాటలు విని పోలీసులే విస్తుపోయారు.

వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం, తన స్నేహితులు బడుగు శ్రావణమూర్తి, పేరంపల్లి రాజేష్, బోరుగడ్డ ప్రవీణ్ కుమార్, నలబోలు కోమల్ నవీన్, బీ కిరణ్ కుమార్ లతో కలసి ముఠాగా ఏర్పడి హైదరాబాద్ లో నేరాలకు పాల్పడేవారు. గత నెల 17న ఓ ఇన్నోవాను అద్దెకు తీసుకుని, హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వచ్చి, ఆపై గుంటూరు జిల్లా ఈపూరు వద్ద, డ్రైవర్ పై పెప్పర్ స్ప్రేను కొట్టి, వాహనంతో పరారైన ఈ బ్యాచ్, దాన్ని విజయవాడలో విక్రయిస్తూ పట్టుబడ్డారు. వీరందరినీ కోర్టులో హాజరు పరిచామని వినుకొండ పోలీసు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News