CASTING COUCH: క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్

  • ఏ అమ్మాయి అయినా తనను తాను అమ్ముకోవాలనుకోదు కదా?
  • ఇక్కడ దీని వల్ల కొంతమందికైనా తిండి దొరుకుతుంది
  • టాలెంట్ ఉంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఎందుకు అంగీకరించాలి?

ప్రతిభ ఉన్న ఏ అమ్మాయి అయినా తనను తాను అమ్ముకోవాలనుకోదు కదా? అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ప్రశ్నించారు. సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది బాబా ఆజాం కాలం నుంచీ ఉన్న సమస్య అని అన్నారు. కేవలం సినీ పరిశ్రమలోనే ఇది జరుగుతుందని అనడం సరికాదని ఆమె సూచించారు. ఇది యావత్ సమాజానికి సంబంధించిన వ్యవహారమని, ప్రభుత్వ శాఖల్లో కూడా వేధింపుల ఉదంతాలు ఉన్నాయి కదా? అని ఆమె గుర్తుచేశారు.  

ఇక సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతానికి వస్తే.. ఇక్కడ (సినీ పరిశ్రమలో) వారిని వాడుకునే మగాళ్లు బాధితులను ఊరికే వదిలేయరని ఆమె పేర్కొన్నారు. ఆ రకంగా కొంతమందికైనా తిండిదొరకుతుందని మర్చిపోవద్దని ఆమె అన్నారు. అవకాశాల కోసం మనం ఒకరికి అమ్ముడుపోవాలా? ఒకరిచేతుల్లో బందీకావాలా? అని ఎవరికివారే ఆలోచించుకోవాలని ఆమె సూచించారు.

మన దగ్గర టాలెంట్‌ ఉంటే అలాంటి వాటికి ఎందుకు అంగీకరించాలి? అని ఆమె ప్రశ్నించారు. కనిపించిన ప్రతి ఆడపిల్లపైనా చెయ్యివెయ్యాలని ఎవరో ఒకరు చూస్తునే ఉంటారని ఆమె చెప్పారు. అన్నంపెట్టే సినీ పరిశ్రమపై బురదచల్లాలని చూడొద్దని ఆమె హితవు పలికారు.

  • Loading...

More Telugu News