USA: హెచ్1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు త్వరలో వర్క్ పర్మిట్ నిరాకరణ!

  • ఒబామా హయాంలో తెచ్చిన నిబంధనలు రద్దుకు ప్రణాళిక
  • ఈ వేసవి అనంతరం ఆదేశాలు జారీ
  • అమెరిక పౌర, వలస సేవల విభాగం వెల్లడి
  • భారతీయులపై ఎక్కువ ప్రభావం

అమెరికాలో హెచ్ 1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉండగా, త్వరలో దీనికి ముగింపు పలకాలని అమెరికా సర్కారు యోచిస్తోంది. చట్టబద్ధంగా దీన్ని నిషేధించే ఆలోచనతో ఉన్నట్టు ఫెడరల్ ఏజెన్సీ ఉన్నతాధికారి చట్టసభ సభ్యులకు తెలిపారు. ఇదే జరిగితే వేలాది మంది భారతీయులకు ఇబ్బందికరమే.

బరాక్ ఒబామా హయాంలో హెచ్1బీ వీసా హోల్డర్లకు ఈ అవకాశం కల్పించగా, దానికి ముగింపు పలకాలన్నది ట్రంప్ సర్కారు ఆలోచన. అమెరికాలో హెచ్1బీ హోల్డర్ల జీవిత భాగస్వాములు సుమారు 70,000 మందికి ప్రస్తుతం వర్క్ పర్మిట్ లు ఉన్నాయి. ముఖ్యంగా ఒబామా హయాంలో తీసుకొచ్చిన ఆదేశాలతో ఎక్కువగా ప్రయోజనం పొందింది భారతీయులే కావడం గమనించాల్సిన అంశం. దీన్ని రద్దు చేస్తూ వేసవి అనంతరం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని అమెరికా పౌర, వలస సేవల విభాగం డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా ఓ లేఖలో సెనేటర్ చుక్ గ్రాస్లేకు తెలిపారు.

  • Loading...

More Telugu News