Karnataka: రాజకీయాల నుంచి తప్పుకున్న కాంగ్రెస్ నేత అంబరీష్!

  • వయోభారం, అనారోగ్య కారణంగానే ఈ నిర్ణయం
  • మండ్యా నియోజకవర్గం నుంచి అంబరీష్ కు లభించిన టికెట్  
  • బీ ఫారమ్ అందుకునేందుకు విముఖత

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కర్ణాటక ‘కాంగ్రెస్’ నేత, ప్రముఖ సినీనటుడు అంబరీష్ ప్రకటించారు. మండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ కూడా ఇచ్చింది. అయితే, వయోభారం, అనారోగ్య కారణంగా తాను రాజకీయాల నుంచి తప్పు కుంటున్నానంటూ బీ ఫారమ్ అందుకునేందుకు ఆయన విముఖత చూపించారు.

దీంతో, షాక్ కు గురైన కాంగ్రెస్ పార్టీ .. మండ్యా నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపింది. కాగా, వయో భారం, అనారోగ్య కారణాల రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంబరీష్ చెబుతున్నప్పటికీ .. అసలు కారణాలు వేరే ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇవ్వాలని, ఆ ఒప్పందానికి అంగీకరిస్తేనే పోటీ చేస్తానని పార్టీ పెద్దలతో అంబరీష్ చెప్పినట్టు ఒక కథనం ప్రచారంలో ఉంది. తన బదులు తన భార్య సుమలతకు టికెట్ ఇవ్వాలని అంబరీష్ చేసిన వినతిని సిద్ధరామయ్య పట్టించుకోలేదని మరో కథనం ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News