suddala ashok teja: సినిమాల్లో తొలి అవకాశం అలా వచ్చింది: గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
- ఉత్తేజ్ మా అక్కయ్య కొడుకు
- తనికెళ్ల భరణికి పరిచయం చేశాడు
- ఆయనే ఫస్టు ఛాన్స్ ఇచ్చారు
తెలుగు సినిమా పాటను పరుగులు తీయించిన గేయ రచయితల్లో సుద్దాల అశోక్ తేజ ఒకరు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.
సినిమాల్లో మొదటి అవకాశం ఎలా వచ్చిందనే ప్రశ్నకి ఆయన సమాధానం చెబుతూ .. "నటుడు ఉత్తేజ్ మా సొంత అక్కయ్య కొడుకు. చిన్నప్పటి నుంచి నేను రాసిన పాటలు వింటూ .. నాటకాలు చూస్తూ పెరిగాడు. నన్ను ఇండస్ట్రీకి బలవంతంగా తీసుకొచ్చింది ఉత్తేజే. అతని ద్వారా నా గురించి తెలుసుకున్న తనికెళ్ల భరణి కబురు చేస్తే వెళ్లాను. నేను రాసుకున్న పాటలు ఆయనకి బాగా నచ్చేశాయి .. తొలి ఛాన్స్ ను ఆయనే ఇప్పించారు. 'నమస్తే అన్న' సినిమా కోసం 'గరం గరం పోరీ .. నా గజ్జెల సవ్వారి' అనే పాట రాశాను" అంటూ చెప్పుకొచ్చారు.