Venkaiah Naidu: రాజ్యసభ సెక్రటేరియట్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వెంకయ్యనాయుడు
- సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టిన వెంకయ్య
- సిబ్బందిపై ఎంతటి పనిభారం ఉంటుందో తనకు తెలుసన్న ఉపరాష్ట్రపతి
- జవాబుదారీతనాన్ని ప్రోత్సహించేందుకే బయోమెట్రిక్ అన్న వెంకయ్య
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చరిత్ర సృష్టించారు. గతంలో ఏ రాజ్యసభ ఛైర్మన్ చేయని విధంగా రాజ్యసభ సెక్రటేరియట్ లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. అధికారులు, సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సిబ్బందిపై ఎంతటి పనిభారం ఉంటుందో తనకు తెలుసని చెప్పారు. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత, సెలవుల్లో సైతం సిబ్బంది కష్టపడుతుంటారని ఆయన అన్నారు. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో పని ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. విధి నిర్వహణలో జవాబుదారీతనాన్ని ప్రోత్సహించేందుకే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.