siddaramaiah: ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఎన్నికల తర్వాత కూడా జేడీఎస్ తో కలవం: సిద్ధరామయ్య

  • ఎన్నికల తర్వాత కూడా జేడీఎస్ తో కలవబోం
  • సొంతంగానే క్లియర్ మెజార్టీ తెచ్చుకుంటాం
  • బీజేపీ, జేడీఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడీఎస్ తో కాంగ్రెస్ పార్టీ కలుస్తుందనే వార్తల్లో నిజం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని కూడా తాను భావించడం లేదని చెప్పారు. క్లియర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారపీఠాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. ఎన్నికల తర్వాత కింగ్ మేకర్ పాత్రను పోషిస్తామంటూ మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి గౌడలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని... మే 12వ తేదీన ఓట్ల రూపంలో తమకు ప్రతిఫలం దక్కుతుందని చెప్పారు.

తనను నరేంద్ర మోదీ, అమిత్ షా, యెడ్యూరప్ప, కుమారస్వామిగౌడలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సిద్దూ ప్రశ్నించారు. బీజేపీని కానీ, యెడ్యూరప్పను కానీ కుమారస్వామి ఎందుకు విమర్శించడం లేదని అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News