low pressure: మరో మూడు రోజుల్లో అల్పపీడనం.. ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు
- దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో అల్పపీడనం
- మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ద్రోణి
- ఉత్తరకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు
ఈ నెల 29కల్లా దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సముద్ర పరిసరాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ ఈమేరకు హెచ్చరించింది. దీని ప్రభావంతో మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. దీని కారణంగా ఉత్తరకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు నిన్న అన్నిచోట్లా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.