anam vivekananda reddy: చంద్రబాబును కూడా నామినేషన్ వేయకుండా ఒప్పించిన ఆనం వివేక!
- 1976లో రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఎన్నికల్లో పోటీ చేసిన ఆనం అన్న కుమారుడు
- నామినేషన్ వేసేందుకు నెల్లూరుకు వెళ్లిన చంద్రబాబు
రాజకీయాల్లో చంద్రబాబు, వైయస్ రాజశేఖరరెడ్డిలకు దివంగత ఆనం వివేకానందరెడ్డి సమకాలికుడు. 1976లో రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన వివేక... 2014 వరకు తన కుటుంబ సభ్యుల ఎదుగుదలకు కృషి చేస్తూనే ఉన్నారు. 1976లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి తన అన్న కుమారుడు భక్తవత్సల రెడ్డి పోటీ చేశారు. ఆ నియోజకవర్గం కింద నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉండేవి.
అదే స్థానానికి ఎస్వీయూ విద్యార్థి నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నామినేషన్ వేయడానికి నెల్లూరుకు వచ్చారు. అయితే, చంద్రబాబుతో మాట్లాడి, ఆయన నామినేషన్ వేయకుండా వివేక ఒప్పించారు. కానీ, ఆ ఎన్నికల్లో భక్తవత్సల రెడ్డి ఓడిపోయారు. 1983లో టీడీపీలో చేరి తన తండ్రి వెంకటరెడ్డికి ఆత్మకూరు, తమ్ముడు రాంనారాయణరెడ్డికి నెల్లూరు టికెట్లు ఇప్పించుకుని, గెలిపించుకున్నారు. చంద్రబాబు, వైయస్ లతో వివేకాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.