anam vivekananda reddy: ఆనం వివేకానందరెడ్డి మరణానికి కారణం ఇదే!
- ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడ్డ వివేక
- 2012లో బయటపడ్డ వ్యాధి
- దేశ, విదేశాల్లో వైద్య చికిత్స
ఎప్పుడూ ఎంతో ఆనందంగా, సరదాగా ఉండే ఆనం వివేకానందరెడ్డి ప్రోస్టేట్ క్యాన్సర్ తో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. 2012 నవంబర్ నుంచి ఆయన ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు బయటపడింది. అప్పటి నుంచి ఆ క్యాన్సర్ మహమ్మారిపై ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. దేశ, విదేశాల్లో చికిత్స చేయించుకున్నారు. ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కూడా ఆయనకు వైద్యం చేశారు.
ఇక గత నవంబర్ లో కూడా వైద్యం కోసం సింగపూర్ వెళ్లి వచ్చారు. కానీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి క్యాన్సర్ మరింత ముదిరింది. జనవరి నుంచి ఆయన హైదరాబాదులోని కిమ్స్ లో చికిత్స పొందారు. తన తల్లి మరణించిన సమయంలో ఒక్కసారి నెల్లూరుకు వెళ్లి వచ్చారు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో, మార్చి 13 నుంచి 40 రోజుల పాటు ఆయన మృత్యువుతో పోరాడారు. నిన్న తుదిశ్వాస విడిచారు.