bjp: అబద్ధాలను ప్రచారం చేయడానికి కాంగ్రెస్ కు విదేశీ ఏజెన్సీల సాయం: ప్రధాని మోదీ విమర్శలు
- అభివృద్ధి లక్ష్యంతోనే ఎన్నికల్లో బీజేపీ పోరాటం
- ఓటర్లను తప్పుదారి పట్టించదు
- కర్ణాటకలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీజేపీయే
- పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రధాని మోదీ
కర్ణాటక ఎన్నికల ముందు ఆ రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ప్రధాని మోదీ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. నరేంద్ర మోదీ యాప్ ద్వారా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆఫీసు బేరర్లు, చట్టసభ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. అభివృద్ధే తమ రాజకీయంగా పేర్కొన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రతీ ఎన్నికల్లో బీజేపీ పోరాడుతుందని చెప్పారు.
బీజేపీ ఏ ఎన్నికల్లోనూ ఓటర్లను తప్పుదారి పట్టించదని స్పష్టం చేస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు చేశారు. అబద్ధాలను వ్యాప్తి చేయడానికి, తప్పుడు ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ విదేశీ ఏజెన్సీలను నియమించుకుందని ఆరోపించారు. కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందన్న వార్తలపై స్పందిస్తూ బీజేపీకి మెజారిటీ వస్తుందని, కర్ణాటకలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీజేపీయేనన్నారు. కర్ణాటకలో మే 12న ఒకే విడత పోలింగ్ జరగనుంది.